Naxals: ఝార్ఖండ్‌లో ముగ్గురు నక్సల్స్ అరెస్ట్.. వారి జీవనశైలికి పోలీసుల అవాక్కు!

  • ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ముగ్గురు నక్సల్స్ అరెస్ట్ 
  • వారి నుంచి బీఎండబ్ల్యూ, థార్ వాహనాలు.. రూ. 3.5 లక్షల నగదు స్వాధీనం
  • ప్రముఖులను బెదిరించిన డబ్బులతో వాహనాల కొనుగోలు
Three PLFI Naxals Arrested in Jharkhands Capital

నక్సలైట్లు అంటే అడవుల్లో ఉంటారని, ఎండకు ఎండుతూ, వానకు నానుతూ బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారని అనుకుంటారు. పోలీసులు కూడా అలాగే భావిస్తుంటారు. అయితే, ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ముగ్గురు నక్సల్స్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి జీవన శైలిని చూసి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. వారు ఖరీదైన కార్లు వినియోగిస్తుండడం వారిని ఆశ్చర్యపరిచింది.

రాంచీలోని ఓ హోటలుపై దాడి చేసిన పోలీసులు పీపుల్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎల్ఎఫ్ఐ)కు చెందిన ముగ్గురు నక్సల్స్‌.. అమీర్‌చంద్ కుమార్, ఆర్యకుమార్ సింగ్, ఉజ్వల్‌ కుమార్ సాహులను అరెస్ట్ చేశారు. వారి నుంచి బీఎండబ్ల్యూ, థార్ వంటి విలాసవంతమైన కార్లతోపాటు రూ. 3.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖులను బెదిరించి వసూలు చేసిన డబ్బులతోనే వారు ఈ వాహనాలను కొనుగోలు చేసినట్టు రాంచీ ఎస్పీ సురేంద్ర కుమార్ ఝా తెలిపారు.

More Telugu News