Mukesh Ambani: రూ. 736 కోట్లతో న్యూయార్క్‌లో హోటల్ కొనుగోలు చేసిన రిలయన్స్

Reliance checks into New York Mandarin Oriental Hotel
  • హోటల్ రంగంపై కన్నేసిన రిలయన్స్
  • గతేడాది యూకేలోని స్టోక్‌పార్క్ కొనుగోలు
  • న్యూయార్క్‌లోని మాండరీన్ ఓరియంటల్ ముకేశ్ చేతికి
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తన సామ్రాజ్యాన్ని మరింతగా విస్తరించుకుంటూ వెళ్తున్నారు. ఇటీవల హోటల్ రంగంపై కన్నేసిన అంబానీ గతేడాది ఏప్రిల్‌లో యూకేలోని స్టోక్ పార్క్ లిమిటెడ్‌ను చేజిక్కించుకున్నారు. తాజాగా, న్యూయార్క్‌లోని ప్రీమియం లగ్జరీ హోటల్ ‘మాండరీన్ ఓరియంటల్’ను దాదాపు 736 కోట్లకు కొనుగోలు చేశారు.

న్యూయార్క్‌లోని 80 కొలంబస్ సర్కిల్‌లో ఉన్న ఈ హోటల్‌ను 2003లో ఏర్పాటు చేశారు. రిలయన్స్ అనుబంధ విభాగమైన రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్‌మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఆర్ఐఐహెచ్ఎల్) ద్వారా ఈ హోటల్‌ను కొనుగోలు చేసింది.
Mukesh Ambani
Reliance Industries
Mandarin Oriental

More Telugu News