Honda: వివిధ మోడళ్ల కార్లపై విస్తృత స్థాయిలో ఆఫర్లు ప్రకటించిన హోండా

Honda Cars India announces offers on various models
  • కొత్త వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం
  • కొత్త సంవత్సరంలో ఆఫర్ల బొనాంజా
  • పలు మోడళ్లపై ధరల తగ్గింపు
  • భారీగా ప్రయోజనాలు
భారత కార్ల మార్కెట్ లో తన వాటా పెంచుకునేందుకు హోండా శ్రమిస్తోంది. తాజాగా, నూతన సంవత్సరం సందర్భంగా ఆకట్టుకునేలా ఆఫర్లు ప్రకటించింది. అనేక మోడళ్లపై విస్తృతస్థాయిలో ప్రయోజనాలు కల్పిస్తూ కొత్త వినియోగదారులను ఆకర్షిస్తోంది. అమేజ్, సిటీ, డబ్ల్యూఆర్-వి, జాజ్ మోడళ్లపై న్యూ ఇయర్ ఆఫర్లు ప్రకటించింది.

హోండా అమేజ్ పై రూ.15 వేలు, హోండా సిటీ ఫోర్త్ జనరేషన్ మోడల్ పై రూ.20 వేలు, హోండా సిటీ ఫిఫ్త్ జనరేషన్ మోడల్ పై భారీగా రూ.35,596 ప్రయోజనాలు అందిస్తోంది. అటు, హోండా డబ్ల్యూఆర్-విపై రూ.26 వేలు, హోండా జాజ్ పై రూ.33,147 వేలు బెనిఫిట్స్ ఇస్తోంది. ధర తగ్గింపు, లాయల్టీ బోనస్, ఎక్చేంజి బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో ఈ ప్రయోజనాలు అందిస్తోంది.
Honda
Offers
Discount
Cars
Models
India

More Telugu News