Pankaj Gupta: రైతు నేత తన గూబ గుయ్యిమనిపించినా ప్రేమతో కొట్టాడని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే!

Farmer slaps BJP MLA Pankaj Gupta
  • ఉత్తరప్రదేశ్ లో ఘటన
  • ఓ విగ్రహావిష్కరణకు హాజరైన బీజేపీ ఎమ్మెల్యే 
  • సభలో ఎమ్మెల్యేపై చేయిచేసుకున్న రైతు నేత
  • వీడియో వైరల్
  • ఈ రైతు నేత తన తండ్రిలాంటివాడన్న ఎమ్మెల్యే
అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఉత్తరప్రదేశ్ లో ఆసక్తికర సంఘటన జరిగింది. ఓ రైతు నేత అధికార బీజేపీ ఎమ్మెల్యేను గూబ గుయ్యిమనిపించేలా కొట్టగా, ఆ తర్వాత అదే రైతు నాయకుడితో కలిసి సదరు ఎమ్మెల్యే వివరణ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించకమానదు.

పంకజ్ గుప్తా ఓ శాసనసభ్యుడు. ఆయన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో సదర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. షహీద్ గులాబ్ సింగ్ లోధీ జయంతి రోజున పంకజ్ గుప్తా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ సభలో పాల్గొన్నారు. అయితే, ఓ రైతు నాయకుడు వేదికపైకి వచ్చి గట్టిగా నినాదాలు చేస్తూ, పంకజ్ గుప్తాను లాగి ఒక్కటిచ్చుకున్నాడు. అంతలో పోలీసులు అక్కడికి చేరుకుని రైతు నేతను వేదిక పైనుంచి దింపేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ క్రమంలో ఎమ్మెల్యే పంకజ్ గుప్తా నష్టనివారణ చర్యలకు దిగారు. ఈ రైతునేతను వెంటబెట్టుకుని ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ రైతు తనను కోపంతో కొట్టలేదని, ఎంతో అభిమానంతో కొట్టాడని వివరణ ఇచ్చారు. ఆ రైతునేత తనకు పితృసమానుడని, తాము ఎన్నో సందర్భాల్లో కలిసి పనిచేశామని, ఆ చనువుతోనే ఆప్యాయంగా కొట్టాడని అన్నారు. వీడియోను ప్రతిపక్షాలు ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పంకజ్ గుప్తా ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే, దీనిపై విపక్ష సమాజ్ వాదీ పార్టీ ఘాటుగా స్పందించింది. రైతు కొట్టింది బీజేపీ ఎమ్మెల్యేని కాదని, యోగి ఆదిత్యనాథ్ నియంతృత్వ ప్రభుత్వాన్ని కొట్టాడని పేర్కొంది.
Pankaj Gupta
BJP MLA
Farmer
Slap
Uttar Pradesh

More Telugu News