'సర్కారువారి పాట' మళ్లీ వాయిదా?

08-01-2022 Sat 18:48
  • దుబాయ్ లో ఉన్న మహేశ్ బాబు 
  • కరోనా కారణంగా మరింత విశ్రాంతి 
  • ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ లేనట్టే 
  • ఏప్రిల్ కి రిలీజ్ డౌటే నంటూ టాక్    
Sarkaru Vaari Paata movie update
మహేశ్ బాబు కథానాయకుడిగా పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారువారి పాట' రూపొందుతోంది. మహేశ్ కూడా ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను ఏప్రిల్ 1వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. మహేశ్ మోకాలు సర్జరీ కారణంగా షూటింగును వాయిదా వేసుకున్నారు.

మోకాలు సర్జరీ చేయించుకున్న మహేశ్, ప్రస్తుతం దుబాయ్ లో రెస్టు తీసుకుంటున్నాడు. అయితే రీసెంట్ గా ఆయనకి కరోనా వచ్చింది. మహేశ్ త్వరగా కోలుకున్నప్పటికీ, తన ఆరోగ్యం విషయంలో ఎక్కువ కేర్ తీసుకునే మహేశ్ ఇప్పట్లో షూటింగుకి రాకపోవచ్చని అంటున్నారు.

ఇక మోకాలు సర్జరీ కారణంగా మహేశ్ బరువు తగ్గడం జరిగింది. ఇటీవల త్రివిక్రమ్ - తమన్ తో దిగిన ఫొటోలోను ఆయన సన్నగా కనిపించాడు. లుక్ తేడా రాకూడదు కనుక, ఆయన కాస్త బరువు పెరిగిన తరువాతనే మళ్లీ సెట్స్ పైకి రావొచ్చని అంటున్నారు. అందువలన ఏప్రిల్ 1న ఈ సినిమా థియేటర్లకు రాకపోవచ్చని చెప్పుకుంటున్నారు.