నెట్ ఫ్లిక్స్ లో 'శ్యామ్ సింగ రాయ్'
- క్రితం నెల 24న వచ్చిన 'శ్యామ్ సింగ రాయ్'
- తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు
- ఓవర్సీస్ లోను మంచి రికార్డు
- ఈ నెల 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. క్రితం ఏడాది నాని నుంచి థియేటర్లకు వచ్చిన సినిమా ఇదే. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోవడం నానీకి చాలా సంతోషాన్ని కలిగించింది. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
ఇటు నానీకి .. అటు సాయిపల్లవికి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పేరు ఉంది. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక నాని తదుపరి సినిమాగా 'అంటే .. సుందరానికీ' సెట్స్ పై ఉండగా, సాయిపల్లవి 'విరాటపర్వం' రిలీజ్ కి రెడీగా ఉంది.