Cricket: కోహ్లీ వైఫల్యంపై డేవిడ్ వార్నర్ రియాక్షన్.. అందరికీ గట్టి వార్నింగ్

David Warner Responds On Virat Kohli Failures
  • కోహ్లీ క్రికెట్ కు ఎంతో చేశాడు
  • అతడికి ఫెయిలయ్యే హక్కుంది
  • రెండేళ్లు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాడు
  • విమర్శకులు అర్థం చేసుకోవాలని కామెంట్
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వైఫల్యంపై ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందించాడు. కోహ్లీని ఆకాశానికెత్తేస్తూ, అతడి పరిస్థితిని విమర్శకులు అర్థం చేసుకోవాలన్నాడు. బ్యాక్ స్టేజ్ విత్ బోరియా ప్రోగ్రామ్ లో భాగంగా జర్నలిస్ట్ బోరియా మజుందార్ తో అతడు చిట్ చాట్ చేశాడు. కోహ్లీ క్రికెట్ కు ఎంతో చేశాడని, అలాంటి ఆటగాడికి ‘విఫలమయ్యే హక్కు ఉంది’ అని అన్నాడు.

రెండేళ్లుగా ఆటగాళ్లంతా ఎంతో కఠిన బయోబబుల్ లో ఉంటున్నారని, ఇప్పుడు కోహ్లీకి ఓ బిడ్డ కూడా పుట్టిందని, ఆ విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలని సూచించాడు. ‘‘గత రెండేళ్ల నుంచి కోహ్లీ వైఫల్యం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కోహ్లీ ఎంత బాగా ఆడుతున్నాడన్నదే మనం చూస్తున్నాం. అతడికి విఫలమయ్యే అవకాశాన్నీ మనం ఇవ్వాలి. అతడికి ఆ హక్కుంది.

నాలుగో ఇన్నింగ్స్ లో స్మిత్ సెంచరీ చేయలేదంటూ జనాలు విమర్శిస్తుంటారు. ఎందుకంటే, ప్రతి నాలుగు ఇన్నింగ్స్ లకో సెంచరీ చేస్తాడు కాబట్టి.. ఇప్పుడు సెంచరీ చేయకుంటే విమర్శల బాణాలన్నీ అతడివైపే ఉంటాయి. వాళ్లూ మనుషులే. గత కొంతకాలంగా వారు ఎంత కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నారో అందరూ అర్థం చేసుకోవాలి’’ అని అందరికీ గట్టి వార్నింగే ఇచ్చాడు వార్నర్.
Cricket
Team India
Virat Kohli
Australia
David Warner

More Telugu News