Vanama Raghava: వనమా రాఘవను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు... 14 రోజుల రిమాండ్

  • పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య
  • ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవపై ఆరోపణలు
  • ఏపీ వైపు పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు
  • కొత్తగూడెం మేజిస్ట్రేట్ ముందు హాజరు
Fourteen days remand for Vanama Raghava

పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు కారకుడంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవ ఎట్టకేలకు పట్టుబడ్డాడు. రాఘవను ప్రాథమికంగా విచారించిన అనంతరం పోలీసులు కొత్తగూడెంలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో అతనికి న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అనంతరం పోలీసులు అతనిని భద్రాచలం జైలుకు తరలించారు. కాగా, రామకృష్ణను బెదిరించినట్టు రాఘవ అంగీకరించాడని పోలీసులు వెల్లడించారు.

గతంలో అతడిపై 11 కేసులు ఉన్నట్టు ఏఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. తాజాగా రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రాఘవతో పాటు 8 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాఘవతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మిగిలినవారు పరారీలో ఉన్నారు.

కాగా, తన కుమారుడిపై ఆరోపణలు రావడంతో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు బహిరంగ లేఖ రాయడం తెలిసిందే. తన కుమారుడు పోలీసు విచారణకు సహకరించేలా చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News