students: మోదీకి 200 ఉత్త‌రాలు రాసిన మెద‌క్ చిన్నారులు

students write letter to modi
  • జిల్లాలో ఓ నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలి
  • రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తే బాగుంటుంది
  • జీవితాలు బాగుప‌డుతాయి
200 మంది మెద‌క్ చిన్నారులు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి 200 ఉత్త‌రాలు రాశారు. తాము చదువుకునేందుకు త‌మ‌ జిల్లాలో ఓ నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని వారు ఆ లేఖల్లో కోరారు. త‌మ‌ జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేస్తే బాగుంటుంద‌ని పేర్కొన్నారు.

జిల్లాల్లో నవోదయ పాఠశాలలు ఉంటే త‌మ జీవితాలు బాగుప‌డతాయ‌ని చెప్పారు. సుమారు 200 మంది విద్యార్థులంతా క‌లిసి పోస్టు కార్డుల ద్వారా ప్రధానికి ఈ విజ్ఞ‌ప్తి చేశారు. కాగా, న‌వోద‌య పాఠ‌శాల‌లు అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాల‌ని చాలా కాలంగా డిమాండ్ ఉన్న విష‌యం తెలిసిందే.
students
Narendra Modi
BJP

More Telugu News