Covid cases: భారత్ లో రోజువారీ కేసులు 30 లక్షలకు చేరొచ్చు: అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నొమురా

  • అమెరికాలో మాదిరిగానే ఉంటే ఇన్ని కేసులు
  • దక్షిణాఫ్రికా మాదిరిగా అయితే 7.4 లక్షలు
  • వృద్ది రేటును తగ్గిస్తుందన్న అంచనా 
Daily Covid cases could hit 3 million if India goes US way

అమెరికాలో మాదిరే కరోనా ఒమిక్రాన్ వైరస్ తీరు భారత్ లో నూ కొనసాగితే.. రోజువారీ కేసులు 30 లక్షల వరకు పెరిగిపోవచ్చని ప్రముఖ అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నొమురా అంచనా వేసింది. అదే నిజమైతే ఆరోగ్య సంరక్షణ రంగంపై ఒత్తిడి పెరిగిపోతుందని హెచ్చరిస్తూ ఒక నోట్ విడుదల చేసింది.

ఒకవేళ దక్షిణాఫ్రికాలో చూసినట్టు భారత్ లో రోజువారీ కేసుల పెరుగుదల నిదానంగా ఉంటే 7,40,000 వరకు చేరుకోవచ్చని నొమురా పేర్కొంది. భారత్ లో రెండు డోసుల టీకా తీసుకున్న వారు 45 శాతంగానే ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. కరోనా మూడో విడత భారత వృద్ది రేటును తగ్గించడమే కాకుండా.. ఆర్ బీఐ పాలసీ సాధారణీకరణను ఏప్రిల్ కు వాయిదా వేసుకునేలా చేయవచ్చని తెలిపింది.

More Telugu News