Lawrence: ఫైట్ మాస్టర్స్ దర్శకత్వంలో లారెన్స్!

Durga Movie Upadate
  • డాన్స్ మాస్టర్ గా లారెన్స్ కి క్రేజ్
  • డైరెక్టర్ గాను మంచి ఇమేజ్
  • మరో హారర్ థ్రిల్లర్ గా 'దుర్గ'
  • దర్శకులుగా అన్బు అరివుకి ఛాన్స్
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రఫర్లలో ప్రభుదేవా తరువాత ఆ స్థాయిలో వినిపించిన పేరు లారెన్స్. అప్పటివరకూ తెరపై కనిపిస్తూ వచ్చిన డాన్సులకు లారెన్స్ చెక్ పెట్టేస్తూ తనదైన మార్క్ చూపించాడు. మెగాస్టార్ కూడా తన సినిమాలకి లారెన్స్ ను సిఫార్స్ చేసేవారంటే అతని టాలెంట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అలాంటి లారెన్స్ నటుడిగా .. దర్శక నిర్మాతగా కూడా తన సత్తా చాటుకున్నాడు.

ఆయన దర్శకత్వంలో వచ్చిన 'కాంచన' .. 'గంగ' సినిమాలు, తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను రాబట్టాయి. ఇప్పటికీ టీవీలో ఆ సినిమాలకు మంచి రేటింగ్ వస్తుంటుంది. అలాంటి లారెన్స్ ఆ మధ్య తన నుంచి 'దుర్గ' సినిమా వస్తున్నట్టుగా ప్రకటించాడు .. ఫస్టులుక్ తోనే భయపెట్టేశాడు. అయితే కరోనా కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది.

తాజా సమాచారం ఏమిటంటే, ఈ సినిమాకి లారెన్స్ దర్శకత్వం చేయడం లేదు .. నిర్మాతగా మాత్రమే ఉంటున్నాడు. 'కబాలి' .. 'కేజీఎఫ్' సినిమాలతో ఫైట్ మాస్టర్స్ గా పేరు తెచ్చుకున్న అన్బు - అరివు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారట. ఈ ఏడాదిలోనే ఈ హారర్ మూవీ ప్రేక్షకులను పలకరించనుందని అంటున్నారు.
Lawrence
Anbu
Arivu
Durga Movie

More Telugu News