Faria Abdullah: దూకుడు పెంచుతున్న ఫరియా అబ్దుల్లా!

  • 'జాతి రత్నాలు'తో పరిచయం 
  • 'బంగార్రాజు'లో మెరవనున్న ఫరియా 
  • సంతోష్ శోభన్ జోడీగా ఛాన్స్ 
  • 'రావణాసుర'లోను దక్కిన అవకాశం
Faria Upcoming Movies

ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన సినిమాలలో 'జాతి రత్నాలు' ముందు వరుసలో కనిపిస్తుంది. ఈ సినిమా చూసిన వాళ్లంతా ఫరియా అబ్దుల్లా అందాలకు ఫిదా అయ్యారు. అందం .. ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ, టాలీవుడ్ లో తన హవాను కొనసాగించడం ఖాయమనే అభిప్రాయాలు బలంగానే వినిపించాయి.

అయితే ఆ స్థాయిలో ఆమెకి వెంట వెంటనే అవకాశాలు పడలేదు. ఫరియా మంచి పొడగరి కావడం వలన, మంచి హైట్ ఉన్న హీరోల జోడీగా మాత్రమే నప్పుతుంది అనుకున్నారు. రీసెంట్ గా ఆమె నాగార్జున 'బంగార్రాజు' సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఫరోయా తన జోరు పెంచుతున్నట్టుగా తెలుస్తోంది. సంతోష్ శోభన్ జోడీగా ఆమె ఒక ఛాన్స్ కొట్టేసింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది. ఇక రవితేజ 'రావణాసుర' సినిమాలోనూ ఫరియా అవకాశాన్ని అందుకుంది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. మరో రెండు సినిమాలకు ఆమె సైన్ చేసే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు.

More Telugu News