earth quake: చైనా కింఘాయ్ ప్రావిన్స్ ను కుదిపేసిన భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదు

  • రాత్రి 1.45 గంటలకు వచ్చినట్టు నమోదు
  • ఆ వెంటనే 5.1 తీవ్రతతో మరో భూకంపం
  • మరణాలు తక్కువే ఉండొచ్చు
  • అమెరికా జియోలాజికల్ సొసైటీ వెల్లడి 
Strong quake hits China Qinghai province

శక్తిమంతమైన భూకంపం శుక్రవారం అర్ధరాత్రి చైనాలోని వాయవ్య ప్రాంతం కింఘాయ్ పావిన్స్ ను కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 6.6 తీవ్రత నమోదైనట్టు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకటించింది. 1.46 గంటలకు భూకంపం నమోదైనట్టు.. భూమికి 10 కిలోమీటర్ల లోతులో దీని కేంద్రం ఉన్నట్లు తెలిపింది. ఇక్సింగ్ పట్టణానికి 140 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు పేర్కొంది. ఆ తర్వాత కూడా 5.1 తీవ్రతతో మరో భూకంపం సంభవించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.

అయితే, చైనా భూకంప నెట్ వర్క్ సెంటర్ ప్రకారం.. భూకంప తీవ్రత 6.9 గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాణనష్టం తక్కువగా వుండచ్చని అమెరికా జియోలాజికల్ సర్వే అంచనా వేసింది. కాకపోతే భారీ నష్టం ఏర్పడొచ్చని పేర్కొంది. ఈ ప్రాంతంలోని నివాసాలు భూకంపాలకు కదిలిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. 2010లో ఇదే కింఘాయ్ ప్రావిన్స్ లో వచ్చిన భూకంప తీవ్రతకు సుమారు 3,000 మంది మరణించినట్టు రికార్డులు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News