Kalvakuntla Vidyasagar Rao: టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ ఇంట్లో అగ్నిప్రమాదం.. భార్య సరోజకు గాయాలు

Fire Accident In TRS MLA Kalvakuntla Vidyasagar Rao House
  • మెట్‌పల్లిలోని ఇంట్లో అగ్నిప్రమాదం
  • పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీక్
  • సరోజను హైదరాబాద్ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
మెట్‌పల్లిలోని కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. సంక్రాంతిని పురస్కరించుకుని పిండి వంటలు చేస్తున్న సమయంలో గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో విద్యాసాగర్ రావు భార్య సరోజకు మంటలు అంటుకున్నాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు మంటలు ఆర్పి, ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నారా? లేరా? అన్న విషయం తెలియరాలేదు.
Kalvakuntla Vidyasagar Rao
TRS
Metpally
Korutla
Fire Accident

More Telugu News