Chandrababu: మేం కోరుతున్నది కూడా అదే కదా!: రఘురామ రాజీనామా వార్తలపై సజ్జల

Sajjala Ramakrishna Reddy Responds about Raghurama Resign News
  • రఘురామ రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తే ఎవరేంటో తేలుతుంది
  • జనసేనతో పొత్తు కోసం చంద్రబాబు చకోర పక్షిలా ఎదురుచూస్తున్నారు
  • పొత్తు కోసం వన్‌సైడ్ ప్రేమను ప్రదర్శిస్తున్నారు
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన పదవికి రాజీనామా చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. తాము కోరుకుంటున్నది కూడా అదేనని అన్నారు. రఘురామరాజు నిన్న మాట్లాడుతూ.. ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలిచి వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకతను నిరూపిస్తానని అన్నారు. విలేకరులు ఈ విషయాన్ని సజ్జల దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన.. తామూ అదే కోరుకుంటున్నామని, రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్తే ఎవరు ఏంటో తేలుతుందని అన్నారు.

అలాగే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపైనా సజ్జల విరుచుకుపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసం చంద్రబాబు పరితపించిపోతున్నారని, చకోర పక్షిలా ఎదురుచూస్తున్నారని ఎద్దేవా చేశారు. పొత్తు కోసం వన్‌సైడ్ ప్రేమను ప్రదర్శిస్తున్నారని అన్నారు. చంద్రబాబు కుప్పంలో చేసిన వ్యాఖ్యలతోనే ఈ విషయం బయటపడిందని అన్నారు.
Chandrababu
Sajjala Ramakrishna Reddy
Raghu Rama Krishna Raju

More Telugu News