Ram Gopal Varma: ఏపీ ప్రభుత్వం నుంచి నాకు ఆహ్వానం అందింది: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma said AP Govt invites him
  • ఇటీవల టికెట్ల అంశంపై గళం వినిపిస్తున్న వర్మ
  • చర్చలకు మంత్రి పేర్ని నాని ఆహ్వానించినట్టు వెల్లడి
  • ఈ నెల 10న భేటీ
  • పేర్ని నానికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్

సినిమా టికెట్ల అంశంలో తన అభిప్రాయాలను ధైర్యంగా వినిపిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తనకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందిందని వెల్లడించారు. సమావేశానికి రావాలంటూ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని నుంచి ఆహ్వానం అందడం ఎంతో సంతోషం కలిగిస్తోందని వర్మ తెలిపారు.

జనవరి 10న అమరావతి సచివాలయంలో తమ భేటీ ఉంటుందని వివరించారు. టికెట్ల ధరల అంశానికి సామరస్యపూర్వక పరిష్కారం కోసం అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకునేందుకు చొరవచూపుతున్న పేర్ని నాని గారికి కృతజ్ఞతలు అంటూ వర్మ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News