Passengers: ఇటలీ నుంచి వచ్చిన మరో విమానంలోనూ కరోనా కలకలం... ఈసారి 150 మందికి పాజిటివ్

Another plane from Italy carries huge number of corona positive passengers
  • ఇటలీ నుంచి వస్తున్న విమానాల్లో కరోనా కలకలం
  • ఇటీవల వచ్చిన విమానంలో 125 కరోనా కేసులు
  • తాజాగా 290 మందితో రోమ్  నుంచి వచ్చిన విమానం  
ఇటలీ నుంచి భారత్ వచ్చిన ఓ విమానంలో 125 మంది ప్రయాణికులకు కరోనా నిర్ధారణ కావడం తెలిసిందే. కాగా, ఇటలీలోని రోమ్ నుంచి అమృత్ సర్ వచ్చిన మరో విమానంలోనూ కరోనా కలకలం రేగింది. ఈసారి 150 మంది కరోనా బాధితులుగా తేలారు. ఆ విమానంలో మొత్తం 290 మంది ప్రయాణికులు ఉండగా, విమానాశ్రయంలో అందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ను ఒమిక్రాన్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కు పంపారు.

భారత్ లో కరోనా వ్యాప్తి ఉద్ధృతమైన సంగతి తెలిసిందే. ఒక్కరోజులో లక్ష కొత్త కేసులు నమోదు కావడం పట్ల నిపుణులు స్పందిస్తూ దేశంలో మూడో దశ కరోనా తాకిడి మొదలైందని అంటున్నారు.
Passengers
Corona Virus
Plane
Italy
Amritsir
India

More Telugu News