Gutha Sukender Reddy: రేపటితో రూ. 50 వేల కోట్ల రైతుబంధు నిధులు జమ కానున్నాయి: గుత్తా సుఖేందర్ రెడ్డి

by tomorrow Rs 50 Cr will be deposited in farmers accounts says Gutha Sukender Reddy
  • రైతుబంధు వల్ల అందరూ లబ్ధి పొందుతున్నారు
  • బీజేపీ దొంగ నాటకాలు ఆడుతోంది
  • కాంగ్రెస్ ని ఎవరూ పట్టించుకోవడం లేదు
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని... ప్రతి ఒక్కరూ ఈ పథకం వల్ల లబ్ధిపొందుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతుబంధు సంబరాలు ఘనంగా జరుగుతున్నాయని చెప్పారు. రేపటితో రూ. 50 వేల కోట్ల రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయని తెలిపారు.

బీజేపీ దొంగ నాటకాలు ఆడుతోందని... కాంగ్రెస్ పార్టీని ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ నేతల మధ్యే కుమ్ములాటలున్నాయని చెప్పారు. ప్రజల మధ్య అల్లకల్లోలాలను సృష్టించి అధికారంలోకి రావాలని బీజేపీ యత్నిస్తోందని మండిపడ్డారు.
Gutha Sukender Reddy
Rythu Bandhu
KCR
TRS

More Telugu News