Thaman: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్ కు కరోనా పాజిటివ్

Music director Thaman tested corona positive
  • టాలీవుడ్ లో మళ్లీ కరోనా కలకలం
  • తాజాగా తమన్ కు పాజిటివ్
  • హోం ఐసోలేషన్ లో తమన్
  • తనను కలిసినవాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచన
టాలీవుడ్ లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అగ్రశ్రేణి సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కూడా కరోనా బారినపడ్డారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో తమన్ కు పాజిటివ్ గా వెల్లడైంది. దాంతో వైద్యుల సలహా మేరకు ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉన్నారు.

గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తమన్ సూచించారు. మరోపక్క, తమన్ త్వరగా కోలుకోవాలంటూ టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, సూపర్ స్టార్ మహేశ్ బాబు, మంచు లక్ష్మి కూడా కరోనా బాధితుల జాబితాలో చేరడం తెలిసిందే.
Thaman
Corona Virus
Positive
Tollywood

More Telugu News