Somu Veerraju: చంద్రబాబు ఎవరినైనా లవ్‌ చేస్తారు: సోము వీర్రాజు సెటైర్

somu veerraju slams chandrababu
  • చంద్రబాబు అవకాశవాది
  • అవసరమైనప్పుడే లవ్‌ చేయడంలో సమర్థుడు
  • గతంలో కాంగ్రెస్‌ను కూడా లవ్‌ చేశారు
  • మేము జ‌న‌సేన‌తో క‌లిసే ఉన్నాం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవకాశవాది అని బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారని, అవసరం వచ్చిన‌ప్పుడు లవ్ చేయడంలో ఆయ‌న దిట్ట అని అన్నారు. ఆ తర్వాత ఆయ‌న‌ ఏం చేస్తారో త‌న నోటితో తాను చెప్పలేనని సోము వీర్రాజు చెప్పారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీని కూడా లవ్ చేశారని అన్నారు.

కాగా జనసేన పార్టీ త‌మ మిత్రపక్షమే అని సోము వీర్రాజు చెప్పారు. ఎన్నికల్లో పొత్తుల విషయంపై చంద్రబాబు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో సోము వీర్రాజు అలా స్పందించారు.  

  • Loading...

More Telugu News