Pushpa: ఈరోజు నుంచి ఓటీటీలో 'పుష్ప'.. మరో రెండు సినిమాలు కూడా!

Pushpa and Varudu Kavalenu and Lakshya movies in OTT
  • సాయంత్రం అమెజాన్ ప్రైమ్ లో 'పుష్ప' స్ట్రీమింగ్ ప్రారంభం
  • నాగశౌర్య నటించిన రెండు చిత్రాలు కూడా ఈరోజు విడుదల
  • జీ5 ఓటీటీలో 'వరుడు కావలెను'... ఆహాలో 'లక్ష్య' స్ట్రీమింగ్ ప్రారంభం

ఈరోజు ఓటీటీలో ఏకంగా మూడు సినిమాలు విడుదల అయ్యాయి. వీటిలో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప' కూడా ఉంది. ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 'పుష్ప' అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంటుంది. మరోవైపు హీరో నాగశౌర్య నటించిన రెండు సినిమాలు 'వరుడు కావలెను', 'లక్ష్య' సినిమాలు ఈ ఉదయం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. జీ5 ఓటీటీలో 'వరుడు కావలెను'... ఆహాలో 'లక్ష్య' స్ట్రీమింగ్ ప్రారంభమయింది. ఒకే రోజున మూడు సినిమాలు ఓటీటీలో విడుదల కావడంతో సినీ అభిమానులు ఖుషీ అవుతున్నారు.

  • Loading...

More Telugu News