Uddhav Thackeray: ఉద్ధవ్ థాకరే భార్యపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు.. మండిపడ్డ ముంబై మేయర్

Mumbai mayor Kishori slams BJP leader for derogatory comments on Uddhav Thackerays wife Rashmi
  • థాకరే భార్య రష్మీని మరాఠి రబ్రీదేవి అన్న జితిన్ గజారియా
  • బీజేపీ ఎదగడానికి బాలాసాహెబ్ థాకరే ఎంతో చేశారన్న కిశోరీ పెడ్నేకర్
  • అలాంటి వ్యక్తి కోడలినే బీజేపీ నేతలు అవమానిస్తున్నారని మండిపాటు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే భార్య రష్మి థాకరేపై బీజేపీ నేత జితిన్ గజారియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై శివసేన నేతలు మండిపడుతున్నారు. రష్మి థాకరేను ఉద్దేశిస్తూ... 'మరాఠి రబ్రీదేవి' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ముంబై మేయర్ కిశోరి పెడ్నేకర్ మండిపడ్డారు. బీజేపీ జాతీయ స్థాయిలో ఎదగడానికి శివసేన వ్యవస్థాపకులు బాలాసాహెబ్ థాకరే ఎంతో చేశారని... అలాంటి వ్యక్తి కోడలిని కించపరుస్తూ ఎలా మాట్లాడతారని ఆమె ప్రశ్నించారు. పార్టీలు మారే గజారియా మహారాష్ట్ర మహిళపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

'జితిన్ గజారియా ఎవరు? ఎన్సీపీ నుంచి బీజేపీలోకి కంగారూ మాదరి దూకిన వ్యక్తి. ఈరోజు ఆయన మహారాష్ట్ర మహిళ అయిన రష్మి గురించి అవమానకర వ్యాఖ్యలు చేశారు. బాలాసాహెబ్ థాకరే కోడలు, ఉద్ధవ్ థాకరే భార్య, ఆదిత్య థాకరే తల్లి అయిన మహారాష్ట్ర మహిళ రష్మిని లాగాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజకీయాల్లో బీజేపీ ఎదగడానికి బాలాసాహెబ్ థాకరే ఎంతో కృషి చేశారు. అలాంటి వ్యక్తి కోడలిపైనే ఇప్పుడు బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి చర్యల వల్ల బీజేపీకి గౌరవం ఎలా వస్తుంది? ఛాలెంజ్ చేస్తున్నా... శివసేనకు చెందిన మహిళా అఘాడీ ముందుకు గజారియా వస్తే... ఆయన సంగతి చూస్తాం' అని కిశోరీ పెడ్నేకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News