Nagarjuna: 'బంగార్రాజు' భలే అదృష్టవంతుడే!

Bangarraju Movie Update
  • 'బంగార్రాజు'గా నాగార్జున
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • ఈ నెల 14వ తేదీన విడుదల
  • అందరిలో పెరుగుతున్న అంచనాలు  
మొదటి నుంచి కూడా నాగార్జునకి ముందుచూపు ఎక్కువే. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన చాలా తెగింపు చూపిస్తారు. 'బంగార్రాజు' విషయంలోను ఆయన అదే విధంగా వ్యవహరించారు. కల్యాణ్ కృష్ణ ఈ సినిమా కథ విషయంలో నాగార్జునను మెప్పించడానికీ ... ఆ తరువాత అనేక కారణాల వలన సెట్స్ పైకి రావడానికి చాలా సమయం పట్టింది. ఇక సెట్స్ పైకి వచ్చిన తరువాత మాత్రం నాగార్జున ఆలస్యం కానివ్వలేదు.

ఇది గ్రామీణ నేపథ్యంతో కూడిన కథ .. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వెంటనే కనెక్ట్ అయ్యే కథ. అందువలన ఆయన ఎలాగైనా ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపాలని బలంగా నిర్ణయించుకున్నారు. అందువల్లనే ఒక వైపున షూటింగు జరుగుతూ ఉండగానే, వెంటవెంటనే అప్ డేట్స్ వదులుతూ వచ్చారు.

ఈ లోగా కరోనా కారణంగా 'ఆర్ ఆర్ ఆర్' .. 'రాధేశ్యామ్' బరి నుంచి తప్పుకున్నాయి. అదృష్టవంతుడికి అడ్డంకులు ఉండవు అన్నట్టుగా ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి 'బంగార్రాజు' రెడీ అయ్యాడు. సీనియర్ హీరోయిన్లలో రమ్యకృష్ణకి ఎంత ఫాలోయింగ్ ఉందో .. యూత్ లో కృతిశెట్టికి అంతటి క్రేజ్ ఉండటం ఈ సినిమాకి మరింతగా కలిసొచ్చే అంశం. అప్పటి వరకూ కరోనా తీవ్రత పెరగకపోతే, టాలీవుడ్ లో 'బంగార్రాజు' అంతటి అదృష్టవంతుడు ఉండడనే చెప్పాలి..
Nagarjuna
Ramyakrishna
Chaitu
Kruthi Shetty
Bangarraju Movie

More Telugu News