Vishal: 'సామాన్యుడు' కొత్త రిలీజ్ డేట్ ఇదే!

Samanyudu Movie Release on Jan 26th
  • వరుస సినిమాలతో విశాల్ 
  • మాస్ యాక్షన్ హీరోగా క్రేజ్
  • మరో యాక్షన్ మూవీగా 'సామాన్యుడు'
  • ఈ నెల 14 నుంచి 26కి వాయిదా  
మొదటి నుంచి కూడా విశాల్ తన సినిమాలను తమిళంతో పాటు తెలుగులోను రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. 'పొగరు' .. 'పందెం కోడి' సినిమాల నుంచి తెలుగులో ఆయన సినిమాలకి ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఇటీవల థియేటర్లకు వచ్చిన 'ఏనిమి' కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఆయన తాజా చిత్రంగా 'సామాన్యుడు' రూపొందింది.

తమిళంలో 'వీరమే వాగై సూదుమ్' పేరుతో తమిళంలో విశాల్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. తెలుగులో ఈ సినిమాకి 'సామాన్యుడు' అనే టైటిల్ ను ఖరారు చేసి అప్ డేట్స్ వదులుతూ వచ్చారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

అయితే తమిళనాట థియేటర్లు మూతబడుతూ ఉండటంతో, ఈ సినిమా విడుదలను అక్కడితో పాటు ఇక్కడ కూడా వాయిదా వేశారు. జనవరి 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, రమణ .. రవీనా రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.
Vishal
Dimple Hayathi
Samanyudu Movie

More Telugu News