Nitin: హీరో నితిన్ కేక్ క‌ట్ చేస్తుండ‌గా కిటికీలోంచి చూసిన ఆయ‌న‌ భార్య‌.. వీడియో వైర‌ల్

nitin celebrates his wife birthday
  • నితిన్ భార్య‌కు క‌రోనా
  • హోం క్వారంటైన్ లో చికిత్స‌
  • ఆమె బ‌ర్త్ డే సెల‌బ్రేషన్

సినీ హీరో నితిన్ భార్య‌కు క‌రోనా సోకింది. ఈ నేప‌థ్యంలో ఆమె హోం క్వారంటైన్ లో ఉంటోంది. ఈ విష‌యం తెలుపుతూ నితిన్ ట్వీట్ చేశాడు. కరోనాకి హద్దులు ఉండొచ్చేమో.. కానీ, ప్రేమకు ఎలాంటి అడ్డంకులు ఉండవని ఆయ‌న అన్నాడు. జీవితంలో ఫస్ట్ టైం త‌న భార్య‌ నెగిటివ్ కావాలని కోరుకుంటున్నానని ఆయ‌న పేర్కొన్నాడు.

కాగా, త‌న భార్య పుట్టిన‌రోజు సంద‌ర్భంగా నితిన్ ప‌లువురితో క‌లిసి కేక్ క‌ట్ చేశాడు. ఆయ‌న కేక్ క‌ట్ చేస్తుండ‌గా ఆయ‌న భార్య కిటికీలోంచి చూసింది. కేక్ కట్ చేసి ఆమెకి చూపిస్తూ నితిన్ కేక్ తిన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నితిన్ త‌న ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

  • Loading...

More Telugu News