Siva Karthikeyan: మిత్రులతో కలిసి హైదరాబాదులో ఓ రెస్టారెంట్ కు విచ్చేసిన తమిళ హీరో శివకార్తికేయన్

Tamil hero Sivakarthikeyan dined at a restaurant in Hyderabad
  • ఇటీవల 'వరుణ్ డాక్టర్' చిత్రంతో హిట్ కొట్టిన హీరో
  • త్వరలో తెలుగులో నటించనున్న వైనం
  • అనుదీప్ దర్శకత్వంలో చిత్రం
  • హైదరాబాద్ కు వచ్చిన శివకార్తికేయన్
  • '1980 మిలిటరీ హోటల్' రెస్టారెంట్ లో విందు
తమిళంలో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యువ హీరోల్లో శివకార్తికేయన్ ఒకడు. ఇటీవలే 'వరుణ్ డాక్టర్' చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. శివకార్తికేయన్ త్వరలోనే నేరుగా ఓ తెలుగు చిత్రంలో నటించనున్నారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పాడు.

తాజాగా, శివకార్తికేయన్ తన ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాదులో సందడి చేశాడు. నగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన '1980 మిలిటరీ హోటల్' రెస్టారెంటులో మిత్రులతో కలిసి విందు ఆస్వాదించాడు. శివకార్తికేయన్ మిత్రబృందం ఇక్కడి ఫేమస్ వంటకాలను లాగించినట్టు ఫొటోలు చూస్తే అర్థమవుతోంది.
Siva Karthikeyan
1980 Military Hotel
Hyderabad
Tollywood
Kollywood

More Telugu News