చంద్రబాబు ఓటమి భయంతోనే కుప్పం పర్యటన చేపట్టారు: ఏపీ మంత్రి పెద్దిరెడ్డి
- మూడు రోజుల కుప్పం పర్యటనను చేపట్టిన చంద్రబాబు
- చంద్రబాబు గెలిచే అవకాశం లేదన్న పెద్దిరెడ్డి
- నిరాశతో జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శ
సీఎం జగన్ ఆధ్వర్యంలో తామంతా గ్రామాల పర్యటనలు చేస్తున్నామని... ఇప్పుడు చంద్రబాబు కూడా ఓటమి భయంతో కుప్పం పర్యటన చేపట్టారని అన్నారు. అభద్రతా భావంతో మూడు రోజుల పర్యటన చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఇక గెలవరనే విషయం కుప్పం ప్రజలందరికీ తెలుసని... తాము కూడా చంద్రబాబుకు గెలిచే పరిస్థితి లేకుండా చేస్తామని అన్నారు. జగన్ కు మంచి పేరు రాకుండా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిరాశ, నిస్పృహలతోనే జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు.