Chandrababu: నేను కుప్పం వదిలిపోతానని దుష్ప్రచారం చేస్తున్నారు: చంద్రబాబు

Chandrababu road show in Kuppam constituency
  • కుప్పంలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన
  • దేవరాజుపురంలో రోడ్ షో
  • ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చానన్న బాబు 
  • 20 రెట్లు ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టీకరణ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మూడు రోజుల పర్యటన నిమిత్తం కుప్పం వచ్చారు. పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఆయన దేవరాజుపురంలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పర్యటనకు వచ్చానని వెల్లడించారు. మూడు రోజుల పాటు నియోజకవర్గంలోనే ఉంటానని చెప్పారు.

తాను కుప్పం నియోజకవర్గాన్ని వదిలిపెడుతున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎప్పటికీ కుప్పం నియోజకవర్గాన్ని వీడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నేతలు మారినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెన్నంటే ఉన్నారని చంద్రబాబు కొనియాడారు. అధికార పార్టీ ఇబ్బందిపెడితే 20 రెట్లు ఎక్కువగా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. కార్యకర్త ఒంటిపై పడే దెబ్బను నాకు తగిలిన దెబ్బగానే భావిస్తా అని పేర్కొన్నారు.
Chandrababu
Kupppam
Road Show
TDP
Chittoor District
Andhra Pradesh

More Telugu News