ఆస్ట్రేలియాలో అదృశ్యమైన హైదరాబాద్ యువకుడు
- ఎంఎస్ చదివేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన మోసిన్ అలీ
- డిసెంబర్ 30వ తేదీ నుంచి అదృశ్యం
- ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు
అయితే డిసెంబర్ 30 నుంచి అతనికి కుటుంబసభ్యులతో సంబంధాలు తెగిపోయాయి. అలీ ఆచూకీ తెలియకపోవడంతో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అలీ అదృశ్యం వివరాలను ఆయన సోదరుడు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాదు, అలీ అదృశ్యంపై ఆస్ట్రేలియాలో పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.