Rain: జోహాన్నెస్ బర్గ్ లో జల్లులు... నాలుగో రోజు ఆట ప్రారంభానికి ఆటంకం

Rain delayed fourth day play in Johannesburg
  • దక్షిణాఫ్రికా విన్నింగ్ టార్గెట్ 240 రన్స్
  • ప్రస్తుతం ఆ జట్టు స్కోరు 118-2
  • విజయానికి 122 రన్స్ దూరంలో ఆతిథ్య జట్టు
  • ఆసక్తికరంగా రెండో టెస్టు
జోహాన్నెస్ బర్గ్ టెస్టు నాలుగో రోజు ఆట ప్రారంభానికి వరుణుడు ఆటంకం కలిగించాడు. అక్కడ జల్లులు కురుస్తుండడంతో ఆట ఇంకా షురూ కాలేదు. 240 పరుగుల లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 2 వికెట్లకు 118 పరుగులతో మూడో రోజు ఆట ముగించింది. కెప్టెన్ డీన్ ఎల్గార్ 46, రాస్సీ వాన్ డర్ డుస్సెన్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఇక ఆ జట్టు విజయం సాధించాలంటే ఇంకా 122 పరుగులు చేస్తే సరి. చేతిలో 8 వికెట్లున్నాయి. ఆరంభ సెషన్ లో కొన్ని వికెట్లు తీయగలిగితే టీమిండియాకు ఈ మ్యాచ్ లో అవకాశాలు ఉంటాయి.

ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 202 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా 229 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో భారత్ 266 పరుగులకు ఆలౌటైంది.
Rain
Delay
Fourth Day
Second Test
Team India
South Africa
Johannesburg

More Telugu News