inter: ఏపీలో జూనియర్ కాలేజీల‌కు ఈ నెల 8 నుంచి 16 వ‌ర‌కు సెల‌వులు

leaves for inter colleges in ap
  • సంక్రాంతి పండుగ సందర్భంగా సెల‌వులు
  • ఇంటర్ విద్యామండలి ఉత్త‌ర్వులు
  • అన్ని విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించే అవ‌కాశం
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని జూనియర్ కాలేజీల‌కు జనవరి 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటిస్తూ ఇంటర్ విద్యామండలి ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నెల 17న కాలేజీలు తిరిగి ప్రారంభించుకోవ‌చ్చ‌ని తెలిపింది. సంక్రాంతి నేప‌థ్యంలో ఇత‌ర విద్యా సంస్థ‌ల‌కు కూడా ఏపీలో సెల‌వులు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లోనూ మెడికల్ కాలేజీలు మిన‌హా అన్ని విద్యా సంస్థ‌ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.


                   
inter
Andhra Pradesh
Sankranti

More Telugu News