Philippines: స‌ముద్రంలో మునిగిపోతోన్న వ్య‌క్తిని మాన‌వ హారంతో కాపాడిన‌ టూరిస్టులు.. వీడియో ఇదిగో

  • స‌ముద్ర తీరంలో స్నానాలాడడానికి వ‌చ్చిన టూరిస్టులు
  • అల‌ల తాకిడికి కొట్టుకుపోబోయిన ఒక టూరిస్టు
  • ఫిలిప్పీన్స్ లోని బిన్మలే బీచ్‌లో ఘ‌ట‌న
This is the breathtaking moment when beachgoers formed a human chain

స‌ముద్ర తీరంలో స్నానాలాడుతూ హాయిగా ఎంజాయ్ చేద్దామ‌ని చాలా మంది ప‌ర్యాట‌కులు వ‌చ్చారు. అయితే, వారిలో ఒక‌రు అల‌ల తాకిడికి స‌ముద్రంలోకి కొట్టుకుపోసాగాడు. ఈ విష‌యాన్ని గుర్తించిన మిగ‌తా ప‌ర్యాట‌కులు వెంట‌నే మాన‌వ హారాన్ని ఏర్పాటు చేసి ఆ వ్య‌క్తిని కాపాడారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. ఫిలిప్పీన్స్ లోని బిన్మలే బీచ్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మునిగిపోతోన్న వ్య‌క్తిని కాపాడ‌డానికి తోటి ప‌ర్యాట‌కులు అంతా క‌లిసి శ‌ర‌వేగంగా మాన‌వ హారం క‌ట్టి కాపాడిన తీరుపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.

More Telugu News