Ministry of External Affairs: త్వరలోనే పౌరులకు ఈ-పాస్ పోర్ట్ లు.. విదేశాంగ శాఖ కసరత్తులు

  • మైక్రో చిప్ ఏర్పాటు
  • ఇందులోనే కీలకమైన సమాచారం
  • ధ్వంసం చేయడానికి వీల్లేకుండా తయారీ
Indians to soon get e passports

వ్యాలెట్ సైజులో చిన్న పాకెట్ పుస్తకం మాదిరిగా ఉండే పాస్ పోర్ట్ కొత్త రూపం సంతరించుకోనుంది. మరింత రక్షణతో ఇది అందుబాటులోకి వస్తోంది. అతి త్వరలోనే పౌరులకు ఈ-పాస్ పోర్ట్ ల జారీని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.

తదుపరి తరం ఈ-పాస్ పోర్ట్ లను ప్రవేశపెట్టనున్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ భట్టాచార్య ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ-పాస్ పోర్ట్ బయోమెట్రిక్ డేటాతో సురక్షితంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయంగా ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ ల వద్ద ప్రక్రియను వేగంగా పూర్తి చేసుకుని వెళ్లిపోయేందుకు వీలవుతుందని చెప్పారు. నాసిక్ లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్ తయారు చేసినట్టు ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు.

మైక్రోచిప్ ను అమర్చిన పాస్ పోర్ట్ కార్డును కేంద్రం జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. చిప్ లో కీలక సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ సాయంతో ఇందులోని డేటాను బదిలీ చేసుకోవడానికి వీల్లేకుండా ఉంటుంది. ధ్వంసం చేయడానికి వీల్లేనంత పటిష్ఠంగా ఉంటుందని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.

మొదటగా 20,000 మంది దౌత్య సిబ్బందికి ఈ-పాస్ పోర్ట్ లను ఇచ్చి చూశారు. అన్నింటినీ పరిశీలించిన అనంతరం పౌరులు అందరికీ దీన్ని త్వరలోనే మంజూరు చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిసింది.

  • Loading...

More Telugu News