Akhanda: ఓటీటీలో 'అఖండ'.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?

Balakrishna Akhanda movie OTT streaming starts from Jan 21 on Disney Hot Star
  • బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'అఖండ'
  • రూ. 150 కోట్ల వరకు వసూలు చేసిన బాలయ్య చిత్రం
  • జనవరి 21 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్  

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన 'అఖండ' చిత్రం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు రూ. 150 కోట్ల వరకు వసూలు చేసిన ఈ చిత్రం... బాలయ్య కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో అఘోరా పాత్రలో బాలయ్య విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసిన అఖండ... ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా 'అఖండ' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 21 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. వాస్తవానికి ఈ నెల 14న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇంతకు ముందు ప్రకటించింది. అయితే కొంత ఆలస్యంగా స్ట్రీమింగ్ 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు ఇప్పుడు తెలిపింది. డిస్నీ ప్లస్ ప్రకటనతో బాలయ్య అభిమానులు ఖుషీ అవుతున్నారు.

  • Loading...

More Telugu News