Cheteshwar Pujara: అలాంటప్పుడు విమర్శలు రావడం సహజమే!: పుజారా వ్యాఖ్య‌లు

  • ఇన్నాళ్లు నాకు మద్దతుగా నిలిచారు
  • జట్టు మేనేజ్‌మెంట్‌కు థ్యాంక్స్
  • విమర్శలను పట్టించుకోను
pujara on his performance

జోహాన్నెస్ బర్గ్ లో టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు మ్యాచు జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 86 బంతుల్లో పుజారా 53 పరుగులు చేశాడు. చాలా కాలం త‌ర్వాత‌ ఆయ‌న తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చాడు. ఈ నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడుతూ పుజారా ఆసక్తికర వాఖ్యలు చేశాడు.

తాను స‌రిగ్గా ఆడ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఇన్నాళ్లు తనకు మద్దతుగా నిలిచిన జట్టు మేనేజ్‌మెంట్‌కు థ్యాంక్స్ చెప్పాడు. ఏడాదిగా తనపై వస్తున్న విమర్శలను తాను అంత‌గా పట్టించుకోలేదని అన్నాడు. టీమ్‌ మేనేజ్‌మెంట్ త‌నకు ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని ఆయ‌న చెప్పాడు. అందుకే బయట త‌నపై కొంద‌రు చేస్తోన్న విమర్శలను తాను పట్టించుకోనని అన్నాడు.

త‌న‌కు కోచింగ్ స్టాఫ్ తో పాటు జ‌ట్టు కెప్టెన్, ఆటగాళ్లందరూ మ‌ద్ద‌తుగా ఉంటార‌ని చెప్పాడు. జ‌ట్టులో అంద‌రూ కష్టపడి ఆడార‌ని, అయితే, ఒక్కోసారి ఎక్కువ పరుగులు చేయలేమ‌ని తెలిపాడు. అలాంటి సమయంలో త‌మపై విమర్శలు రావడం స‌హ‌జ‌మేన‌ని చెప్పాడు. వాటిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుపోవాలని అన్నాడు.

More Telugu News