Vasantha Venkata Krishna Prasad: వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు.. తన పాత్ర ఏమీ లేదన్న వసంత కృష్ణ ప్రసాద్

YCP MLA Vasantha Venkata Krishna Prasad steps Telangana High Court on Jagan Assets Case
  • సీబీఐ తనపై నమోదు చేసిన క్విడ్ ప్రోకో కేసును కొట్టేయాలని పిటిషన్
  • కృష్ణ ప్రసాద్, వసంత ప్రాజెక్ట్స్ వేర్వేరుగా తెలంగాణ హైకోర్టుకు..
  • కుట్రలో తన పాత్ర లేదని స్పష్టీకరణ
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ తనపై చేస్తున్న ఆరోపణల్లో ఎంత మాత్రమూ నిజం లేదని వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. గృహ నిర్మాణ మండలి-ఇందూ సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు విషయంలో సీబీఐ ఆరోపిస్తున్నట్టుగా క్విడ్‌ ప్రోకో పెట్టుబడుల కుట్రలో తన పాత్ర ఎంతమాత్రమూ లేదని స్పష్టం చేశారు.

కాబట్టి జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ కృష్ణప్రసాద్, ఆయనకు చెందిన వసంత ప్రాజెక్ట్స్ తెలంగాణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేయగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు.
Vasantha Venkata Krishna Prasad
YSRCP
YS Jagan
TS High Court
CBI

More Telugu News