Raviteja: రవితేజ కోసం రంగంలోకి లేడీ విలన్!

Ravanasura Movie Update
  • రిలీజ్ కి రెడీగా 'ఖిలాడి'
  • లైన్లో రెండు సినిమాలు 
  • సెట్స్ పైకి 'రావణాసుర'
  • ఈ నెల 14న పూజా కార్యక్రమాలు   

రవితేజ కథానాయకుడిగా ప్రేక్షకులను పలకరించడానికి వరుస సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఫిబ్రవరి 11వ తేదీన విడుదల కావడానికి 'ఖిలాడి' రెడీ అవుతోంది. ఆ తరువాత సినిమాలుగా 'రామారావు ఆన్ డ్యూటీ' .. 'ధమాకా' షూటింగు దశలో ఉన్నాయి. ఆల్రెడీ 'రామారావు ఆన్ డ్యూటీ' ముగింపు దశకి చేరుకుంది.

ఇక ఆ తరువాత సినిమాగా ఆయన 'రావణాసుర' చేయనున్నాడు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఇందులో రవితేజ సరసన నాయికలుగా ముగ్గురు హీరోయిన్లు సందడి చేయనున్నారు.

ఈ సినిమాలో లేడీ విలన్ గా చాలా పవర్ఫుల్ పాత్రలో దక్ష నగార్కర్ కనిపించనున్నట్టు చెబుతున్నారు. అయితే తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా కాదు.. ఈ ముంబై భామ 2015లోనే తేజ దర్శకత్వంలో వచ్చిన 'హోరా హోరి' సినిమాతో పరిచయమైంది. ఆ తరువాత వచ్చిన 'హుషారు'లో మెరిసింది. ఇటీవల 'జాంబిరెడ్డి'లోను కనిపించిన దక్ష .. నెగెటివ్ షేడ్స్ కలిగిన ఈ పాత్రలో ఎలా చేస్తుందో చూడాలి.

  • Loading...

More Telugu News