Narendra Modi: ఎయిర్ పోర్టుకు ప్రాణాలతో రాగలిగా.. మీ సీఎంకు థ్యాంక్స్: పంజాబ్ అధికారులతో మోదీ

Modi says thanks to your CM after reaching airport
  • మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యం
  • ఫ్లైఓవర్ పై 20 నిమిషాల సేపు ఆగిపోయిన మోదీ కాన్వాయ్
  • అక్కడి నుంచి ఎయిర్ పోర్టుకు తిరిగి వెళ్లిన ప్రధాని

ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం కలకలం రేపుతోంది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఓ ఫ్లైఓవర్ పై దాదాపు 20 నిమిషాల సేపు నిలిచిపోయింది. నిరసనకారులు రోడ్డును నిర్బంధించడంతో మోదీ ఫ్లైఓవర్ పైనే ఆగిపోయారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. ఇది అతి పెద్ద భద్రతా లోపమని కేంద్ర హోంశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే పూర్తి స్థాయి నివేదికను ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరోవైపు ఘటన జరిగిన ప్రదేశం నుంచి భతిండా ఎయిర్ పోర్టుకు మోదీ తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద ఉన్న రాష్ట్ర అధికారులతో ఆయన మాట్లాడుతూ, 'భతిండా ఎయిర్ పోర్టు వరకు నేను ప్రాణాలతో రాగలిగాను. మీ సీఎంకు థ్యాంక్స్' అని అన్నారు. మరోవైపు ఈ ఘటన వల్ల ప్రధాని మోదీ ఫిరోజ్ పూర్ ర్యాలీ రద్దయింది.

  • Loading...

More Telugu News