వాయిదా బాటలో అజిత్ 'వలిమై'

05-01-2022 Wed 18:12
  • అజిత్ హీరోగా రూపొందిన 'వలిమై'
  • నిర్మాతగా బోనీ కపూర్ 
  • ఈ నెల 13న పాన్ ఇండియా రిలీజ్ 
  • కరోనా ఎఫెక్ట్ తో వాయిదా     
Valimai Release Postponed
కోలీవుడ్ లో కొంతకాలంగా అజిత్ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఆయన తాజా చిత్రంగా 'వలిమై' రూపొందింది. భారీ బడ్జెట్ తో బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకి వినోద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 13వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.

తెలుగులో ఈ సినిమాను 'బలం' అనే టైటిల్ తో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తరువాత ఆలోచన మార్చుకుని 'వలిమై' అనే పేరుతోనే పోస్టర్లు వదిలారు. తమిళ సినిమాను అదే టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేయాలనుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ షాక్ నుంచి తేరుకునేలోగానే ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు.

ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు మూతబడుతూ వస్తున్నాయి. తాజాగా తమిళనాడులో కూడా థియేటర్లను మూసివేయాలనే నిర్ణయం జరిగిపోవడంతో, ఈ సినిమా విడుదలను వాయిదా వేయక తప్పలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి బరిలోకి చాలా సినిమాలు దిగుతున్నాయి కానీ, అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలి.