Naveen Patnaik: మదర్ థెరెసా చారిటీకి కేంద్ర సర్కారు చెక్.. ఆదుకున్న ఒడిశా సీఎం 

  • నిలిచిపోయిన విదేశీ విరాళాలు
  • నిబంధనలను పాటించడం లేదన్న కేంద్రం
  • ఒడిశాలో మిషనరీష్ ఆఫ్ చారిటీకి రూ.78 లక్షల మంజూరు
  • 8 జిల్లాల పరిధిలో సంస్థ సేవలకు సాయానికి సీఎం ఆదేశం
Naveen Patnaik Steps In After Centres Move On Mother Teresa Charity

మదర్ థెరెసా స్థాపించిన ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’కి ఆర్థిక సాయం అందించేందుకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ముందుకు వచ్చారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. 1950లో దీన్ని మదర్ థెరెసా కోల్ కతా కేంద్రంగా స్థాపించారు. మిషనరీస్ ఆఫ్ చారిటీకి విదేశాల నుంచి భారీగా విరాళాలు ఏటా వస్తుంటాయి. ఈ నిధులను సేవా కార్యక్రమాలను వినియోగిస్తుంటుంది.

అయితే, భారతీయ చట్టాల ప్రకారం విదేశాల నుంచి విరాళాలు స్వీకరించేందుకు వీలుగా అర్హత నిబంధనలను సంస్థ పాటించడం లేదని కేంద్ర సర్కారు తేల్చింది. దీంతో విదేశాల నుంచి విరాళాలు నిలిచిపోయాయి. ఈ సంస్థ ఒడిశాలో అనాథ శరణాలయాలు, కుష్టు వ్యాధి బాధితుల కేంద్రాలను నిర్వహిస్తోంది. దీంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.78.76 లక్షలను మిషనరీస్ ఆఫ్ చారిటీ నిర్వహణలోని 13 సంస్థలకు మంజూరు చేయాలని సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారు.

8 జిల్లాల పరిధిలో నడుస్తున్న 13 సంస్థలకు నిధులు అందేలా చూడాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. ఈ సంస్థల పరిధిలో ఆశ్రయం పొందుతున్న ఏ ఒక్కరూ ఇబ్బంది (ఆహారం, ఆరోగ్య పరంగా) పడకుండా చూడాలని కోరారు.  

More Telugu News