Balakrishna: బాలయ్యతో జయమ్మ ఢీ అంటే ఢీ!

Varalakshmi Sharath Kumar in Gopichand Malineni movie
  • 107వ సినిమాకు బాలయ్య రెడీ
  • ప్రతినాయకుడిగా దునియా విజయ్
  • నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో వరలక్ష్మి 
  • సంగీత దర్శకుడిగా తమన్  

బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని ఒక సినిమా చేస్తున్నాడు. కెరియర్ పరంగా బాలకృష్ణకి ఇది 107వ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ తరువాత బాలకృష్ణ, 'క్రాక్' వంటి సూపర్ హిట్ తరువాత గోపీచంద్ మలినేని చేస్తున్న సినిమా కావడంతో అందరిలోను ఆసక్తి పెరుగుతూ పోతోంది.

తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాకి సాయిమాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ఫుల్ ప్రతినాయకుడి పాత్రకి కన్నడ స్టార్ 'దునియా విజయ్'ని తీసుకున్నట్టుగా ఇటీవలే ప్రకటించారు. ఇక ఆ స్థాయికి ఎంతమాత్రం తగ్గని మరో పాత్రకోసం వరలక్ష్మి శరత్ కుమార్ ను తీసుకున్నారు. సెట్స్ పైకి ఆమెకు ఆహ్వానం పలుకుతూ ఈ సినిమా టీమ్ ఒక పోస్టర్ ను వదిలింది.

తమిళనాట తిరుగులేని విలన్ గా వరలక్ష్మి శరత్ కుమార్ కొనసాగుతోంది. లేడీ విలన్ పాత్రలకి అక్కడ అందరూ ముందుగా పరిశీలించే పేరు ఆమెదే కావడం విశేషం. తెలుగులో 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్'లోను .. 'క్రాక్' సినిమాలో జయమ్మగాను ఆమె తన విలనిజాన్ని రుచి చూపించింది. ఇక బాలకృష్ణతో ఢీ అంటే ఢీ అంటూ ఆమె ఏ రేంజ్ లో తలపడుతుందో చూడాలి..

  • Loading...

More Telugu News