Marathon: కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మారథాన్ లో తొక్కిసలాట... అమ్మాయిలకు గాయాలు

Stampede at Congress organized Marathon in Bareilly
  • ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఘటన
  • మారథాన్ నిర్వహించిన కాంగ్రెస్
  • భారీ ఎత్తున పాల్గొన్న అమ్మాయిలు
  • తొక్కిసలాటకు బీజేపీ కుట్ర చేసిందన్న కాంగ్రెస్
ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో కాంగ్రెస్ పార్టీ 'లడ్కీ హూ, లాడ్ సక్తీ హూ' (నేను అమ్మాయిని... నేను పోరాడగలను) పేరిట నిర్వహించిన మారథాన్ పరుగు రసాభాస అయింది. ఈ మారథాన్ పోటీలో పెద్ద సంఖ్యలో అమ్మాయిలు పాల్గొన్నారు. అయితే, ఈ రేసులో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పలువురు అమ్మాయిలకు గాయాలయ్యాయి.

దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ బీజేపీ సర్కారు మారథాన్ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కుట్ర పన్నిందని ఆరోపించారు. కొందరు అమ్మాయిలు గాయపడ్డారని, దీనిపై మరిన్ని వివరాలు రావాల్సి ఉందని యూపీ కాంగ్రెస్ చీఫ్ అశోక్ సింగ్ పేర్కొన్నారు. తాము మారథాన్ పోటీ నిర్వహిస్తున్నట్టు జిల్లా అధికార యంత్రాంగానికి తెలిసినా, ఏమాత్రం సహకరించలేదని అన్నారు. స్థానిక అధికారుల ఉదాసీనత వల్లే తొక్కిసలాట జరిగిందని తెలిపారు.
Marathon
Stampede
Congress
Bareilly
Uttar Pradesh

More Telugu News