First Single: రాజ'శేఖర్' నుంచి రేపు తొలి గీతం విడుదల

  • రాజశేఖర్ హీరోగా 'శేఖర్'
  • జీవిత దర్శకత్వంలో చిత్రం
  • 'లవ్ గంటే' అనే పాట విడుదల చేయనున్న చిత్రబృందం
  • శేఖర్ సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం
First single from Sekhar will release tomorrow

విలక్షణ నటుడు రాజశేఖర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'శేఖర్'. ఈ చిత్రానికి జీవిత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం నుంచి రేపు సాయంత్రం 4 గంటలకు తొలి పాట విడుదల కానుంది. 'లవ్ గంటే' అనే హుషారైన పాట అందరినీ అలరిస్తుందని చిత్రబృందం ఓ ప్రకటనలో పేర్కొంది. అనూప్ రూబెన్స్ బాణీలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు.

కాగా, 'శేఖర్' చిత్రం సంక్రాంతికి విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణంలో రాజశేఖర్ కుమార్తెలు కూడా భాగస్వాములు. మలయాళంలో హిట్టయిన 'జోసెఫ్' చిత్రాన్ని శేఖర్ గా రీమేక్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో రాజశేఖర్ గెటప్ విలక్షణంగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మరికొన్నిరోజుల్లో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.

More Telugu News