శంషాబాద్ ఎయిర్ పోర్టులో బీజేపీ నేతలతో జేపీ నడ్డా సమావేశం

04-01-2022 Tue 17:42
  • బండి సంజయ్ అరెస్ట్
  • ర్యాలీకి పిలుపునిచ్చిన బీజేపీ
  • హైదరాబాద్ చేరుకున్న నడ్డా
  • శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్తత
JP Nadda held meeting with BJP leaders in Shamshabad airport
పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో నిర్వహించతలపెట్టిన శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చారు. అయితే ఆయన ఇంకా శంషాబాద్ విమానాశ్రయంలోనే ఉన్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు నడ్డాకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో, నడ్డా ఎయిర్ పోర్టులోనే తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్, డాక్టర్ కె.లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, విజయశాంతి, రామచంద్రరావు, కాసం వెంకటేశ్వర్లు తదితరులతో ఆయన భేటీ అయ్యారు. తాజా పరిస్థితులపై వారితో చర్చించారు. నడ్డా రాకతో శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.