Chiranjeevi: 'హిట్లర్' హిట్టుకు పాతికేళ్లు!

  • చిరూ క్రేజ్ పెంచిన 'హిట్లర్'
  • 1997 జనవరి 4న వచ్చిన సినిమా
  • థియేటర్స్ దగ్గర వసూళ్ల వర్షం
  • ఈవీవీ వదులుకున్న సినిమా
Hitler Movie Completed 25 years

చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'హిట్లర్' ఒకటి. కథాకథనాల పరంగాను .. పాటల పరంగాను ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. ఈ సినిమాకి ముందు చిరంజీవి చేసిన కొన్ని సినిమాలు వరుసగా పరాజయం పాలవుతూ వచ్చాయి. దాంతో ఆయన ఆలోచనలో పడిన పరిస్థితి అది.

అలాంటి సమయంలోనే మలయాళంలో మమ్ముట్టి చేసిన 'హిట్లర్' సినిమాకి రీమేక్ చేసే ఛాన్స్ చిరంజీవికి వచ్చింది. ఎడిటర్ మోహన్ మొదట ఈ సినిమాను ఈవీవీ దర్శకత్వంలో మోహన్ బాబుతో చేయాలనుకున్నారు గానీ కుదరలేదు. చివరికి చిరంజీవి - ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్లో 1997 జనవరి 4వ తేదీన వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

అంటే ఈ రోజుతో ఈ సినిమా పాతికేళ్లను పూర్తిచేసుకుంది. ఇక మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే, అప్పట్లో ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా ఇప్పుడు 'గాడ్ ఫాదర్' సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

More Telugu News