TS High Court: కరోనా ఎఫెక్ట్... తెలంగాణ హైకోర్టులో ప్రత్యక్ష విచారణల నిలిపివేత

Telangana high court suspends physical hearings due to corona affect
  • తెలంగాణలో కరోనా తీవ్రత
  • పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
  • కీలక నిర్ణయం తీసుకున్న హైకోర్టు
తెలంగాణలో కరోనా వ్యాప్తి మరోసారి అధికమవుతున్న నేపథ్యంలో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. డివిజన్, సింగిల్ బెంచ్ లలో ప్రత్యక్ష విచారణలను నిలిపివేస్తున్నట్టు ఓ ప్రకటన చేసింది. అయితే, వ్యక్తిగత హోదాలో జడ్జీలు కొవిడ్ నిబంధనలు పక్కాగా పాటిస్తూ ప్రత్యక్ష విచారణ జరుపుకోవచ్చని పేర్కొంది.

ఆన్ లైన్, లేదా ఆఫ్ లైన్ విచారణ వారి ఇష్టానికే వదిలేసింది. తెలంగాణలో కొవిడ్-19, ఇతర వేరియంట్ల విజృంభణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టు తెలిపింది.

ఒకవేళ ప్రత్యక్ష విచారణ చేపట్టాలని జడ్జీలు భావించినట్టయితే, న్యాయవాదులతో పాటు కక్షిదారులు కూడా కొవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరిగా అనుసరించాలని, మాస్కులు ధరించడంతో పాటు శానిటైజేషన్, భౌతికదూరం నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.
TS High Court
Physical Hearings
Suspension
Off Line
Online
Corona Virus

More Telugu News