Bulli Bai App: 'బుల్లీ బాయ్' యాప్ కేసులో ఇంజినీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న ముంబయి పోలీసులు

Mumbai police detained Engineering student in connection with Bulli Bai app
  • కలకలం రేపిన 'బుల్లీ బాయ్' యాప్
  • యాప్ నిండా ముస్లిం మహిళల ఫొటోలు
  • మహిళలు అమ్మకానికి ఉన్నారంటూ ప్రచారం
  • రాజకీయ పక్షాల ఆగ్రహావేశాలు

దేశవ్యాప్తంగా కలకలం రేపిన 'బుల్లీ బాయ్' యాప్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుల్లీ బాయ్ అనే యాప్ లో వందల సంఖ్యలో ముస్లిం మహిళల ఫొటోలు వెలుగు చూడడం తెలిసిందే. ఆ మహిళలు అమ్మకానికి ఉన్నారంటూ వేలం నిర్వహించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుండడంతో విషయం తెరపైకి వచ్చింది.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబయి సైబర్ సెల్ పోలీసులు బెంగళూరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ యాప్ కు నలుగురు ఫాలోవర్లు ఉండగా, వారిలో ఈ విద్యార్థి ఒకడని గుర్తించారు. పోలీసులు అతడిని ముంబయి తీసుకువస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

కాగా, 'బుల్లీ బాయ్' యాప్ ను తమ ప్లాట్ ఫాం నుంచి తొలగించినట్టు మైక్రోసాఫ్ట్ కు చెందిన ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్ వేదిక గిట్ హబ్ వెల్లడించింది.

  • Loading...

More Telugu News