Fake Darshan Tickets: తిరుమలలో నకిలీ దర్శన టికెట్ల దందా... ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు

  • మధ్యప్రదేశ్ కు చెందిన భక్తుల వద్ద నకిలీ టికెట్లు
  • గుర్తించిన విజిలెన్స్ అధికారులు
  • నకిలీ టికెట్లను తయారుచేస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్
  • మూడు టికెట్లను రూ.21 వేలకు అమ్మిన వైనం
Fake Darshan tickets scam in Tirumala

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారి నకిలీ దర్శన టికెట్ల దందా బట్టబయలైంది. భద్రతా విధులు నిర్వర్తించే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)కు చెందిన ఓ కానిస్టేబుల్ నకిలీ దర్శన టికెట్లు తయారుచేస్తున్నట్టు వెల్లడైంది.

ఆ కానిస్టేబుల్ మధ్యప్రదేశ్ కు చెందిన ముగ్గురు భక్తులకు ఈ టికెట్లను రూ.21 వేలకు విక్రయించినట్టు గుర్తించారు. వాస్తవానికి అసలు టిక్కెట్ టికెట్ ధర రూ.300 మాత్రమే. దర్శనానికి వచ్చిన మధ్యప్రదేశ్ భక్తుల వద్ద నకిలీ టికెట్లు ఉండడంతో విజిలెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెల్లడైంది.

అనంతరం సదరు ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. టికెట్ స్కానింగ్, లడ్డూ కౌంటర్ వద్ద పనిచేసే మరో ఇద్దరు ఉద్యోగులు ఈ నకిలీ టికెట్ల దందాలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కు సహకరించినట్టు గుర్తించారు. ఈ వ్యవహారం ఎప్పటినుంచి సాగుతోందన్న దానిపై విజిలెన్స్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

More Telugu News