Andhra Pradesh: ఈ సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీ ఏకంగా 6,970 ప్రత్యేక సర్వీసులు

ap rtc bus services
  • గత ఏడాది కంటే 35 శాతం అధికంగా ఏపీఎస్ ఆర్టీసీ బ‌స్సులు
  • పండగ ముందు 4,145 ప్రత్యేక సర్వీసులు
  • పండగ తరువాత 2,825 సర్వీసులు 
సంక్రాంతి పండుగ‌ సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏపీఎస్ ఆర్టీసీ ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఏపీకి ప‌లు ప్రాంతాల నుంచి త‌ర‌లివ‌చ్చే వారి కోసం భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సంక్రాంతి సీజన్‌లో ఏకంగా 6,970 ప్రత్యేక సర్వీసులు న‌డ‌ప‌నుంది.

వాటిలో పండగ ముందు 4,145 ప్రత్యేక సర్వీసులు, పండగ తరువాత 2,825 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళికను ఆమోదించింది. గత ఏడాది కంటే 35 శాతం అధికంగా ఈ ఏడాది ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీ ఆర్టీసీ నిర్ణయించింది.
Andhra Pradesh
rtc

More Telugu News