Nadendla Manohar: సినిమా టికెట్ల ధ‌ర‌లు తప్ప వేరేది తెలియదు అతనికి: నాదెండ్ల మ‌నోహ‌ర్ వ్యంగ్యం

nedendla slams jagan
  • పేద ప్రజల గురించి సీఎం జ‌గ‌న్ ఆలోచించ‌ట్లేదు 
  • చిత్త శుద్ధి ఉంటే ఇసుక, సిమెంట్ ధరలు తగ్గించాలి
  • బస్సు టికెట్ల ధరలను ప్ర‌భుత్వం 50 శాతం పెంచింది
  • ఆర్టీసీ టికెట్ ధరలు తగ్గించే దమ్ము జగన్ గారికి లేదా? అన్న నాదెండ్ల 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపుపై వివాదం చెల‌రేగుతోన్న విష‌యం తెలిసిందే. దీనిపై జ‌న‌సేన నేత నాదెండ్ల మ‌నోహ‌ర్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు నిర్వ‌హించిన పార్టీ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... పేద ప్రజల గురించి సీఎం జ‌గ‌న్ ఆలోచించ‌ట్లేద‌ని అన్నారు.

'సినిమా టికెట్ల ధ‌ర‌లు మాత్రమే తప్ప వేరేది తెలియదు అతనికి' అంటూ నాదెండ్ల ఎద్దేవా చేశారు. జ‌గ‌న్‌కు చిత్త శుద్ధి ఉంటే ఇసుక, సిమెంట్ ధరలు తగ్గించాల‌ని ఆయన డిమాండ్ చేశారు. సొంత రాష్ట్రంలో ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు వలసకు వెళ్లిన ప్ర‌జ‌లు పండుగలకు తమ గ్రామాలకు వస్తుంటారని నాదెండ్ల మ‌నోహ‌ర్ అన్నారు. వారు ప్రయాణించే బస్సు టికెట్ల ధరలపై ఏపీ ప్ర‌భుత్వం 50 శాతం పెంచిందని ఆయ‌న విమ‌ర్శించారు.

మరి, సామాన్యుల కోసం ఆర్టీసీ టికెట్ ధరలు తగ్గించే దమ్ము సీఎం జగన్ రెడ్డి గారికి లేదా? అని నాదెండ్ల మనోహర్ నిల‌దీశారు. వీట‌న్నింటి గురించి ప‌ట్టించుకోకుండా సినిమా టికెట్ల‌ను త‌గ్గించ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

  • Loading...

More Telugu News